Balakrishna: బాలయ్యను ఢీకొట్టనున్న ఊరమాస్ విలన్!

Gipichand Malineni movie update
  • బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని మూవీ
  • కథానాయికగా తెరపైకి శ్రుతి హాసన్ పేరు  
  • ఇతర నటీనటుల ఎంపిక పనిలో దర్శకుడు
  • త్వరలో పట్టాలెక్కనున్న ప్రాజెక్టు
బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ను ప్లాన్ చేశాడు. రాయలసీమతో ఈ కథ ముడిపడి ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పై గోపీచంద్ మలినేని కసరత్తు పూర్తయింది. ప్రస్తుతం  ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

ఇక బాలయ్య సరసన నాయికగా ఇప్పటికే శ్రుతి హాసన్ ను ఎంపిక చేసినట్టుగా వార్తలు వచ్చాయి. మరో కథానాయికకు కూడా చోటు ఉందని అంటున్నారు. ప్రస్తుతం ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఇక ఈ సినిమాలో బాలకృష్ణతో తలపడే పవర్ఫుల్ విలన్ ను కన్నడ నుంచి దింపుతున్నట్టుగా సమాచారం .. ఆ విలన్ పేరే దునియా విజయ్.

కన్నడలో రౌడీ రోల్స్ ఎక్కువగా చేసిన విజయ్ .. 'దునియా' సినిమాతో హీరోగా మారాడు. అప్పటి నుంచి ఆ సినిమా పేరు ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. బాలకృష్ణ  సినిమా కోసం ఆయనను తీసుకున్నట్టుగా చెప్పుకుంటున్నారు. గతంలో కన్నడ నుంచి వచ్చిన ప్రభాకర్ .. దేవరాజ్  ఇక్కడ విలన్స్ గా రాణించిన సంగతి తెలిసిందే.
Balakrishna
Gopichand Malineni
Duniya Vijay

More Telugu News