రేపు చెన్నైలో రాజశేఖర్ తండ్రి అంత్యక్రియలు... జీవిత ప్రకటన

Jeevitha statement on his husband Rajasekhars fathers funerals
  • నిన్న సాయంత్రం మా మామగారు మృతి చెందారు
  • ఆయన భౌతికకాయాన్ని ఈరోజు చెన్నైకి  తరలిస్తున్నాం
  • రేపు మధ్యాహ్నం 12 తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తాం
సినీ నటుడు రాజశేఖర్ తండ్రి వరదరాజన్ గోపాల్ నిన్న సాయంత్రం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. హైదరాబాదులోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో ఆయన కన్నుమూశారు. ఈ సందర్భంగా జీవితా రాజశేఖర్ ఓ ప్రకటన విడుదల చేశారు.

'హైదరాబాదులో నిన్న సాయంత్రం 6.30 గంటలకు మా మామగారు వరదరాజన్ (రిటైర్ట్ పోలీస్ డిప్యూటీ కమిషనర్) చనిపోయారని చెప్పడానికి చింతిస్తున్నాం. ఆయన వయసు 94 సంవత్సరాలు. ఆయన భౌతికకాయాన్ని ఈరోజు చెన్నైకి తరలిస్తున్నాం. సాయంత్రం 4 గంటల తర్వాత ప్రజల సందర్శనార్థం ఆయన పార్థివదేహాన్ని చెన్నైలోని ఆయన ఇంటివద్ద  (నంబర్ 26, AI బ్లాక్, 8వ మెయిన్ రోడ్డు, అన్నా నగర్, చెన్నై-40) ఉంచుతాం. రేపు మధ్యాహ్నం 12 గంటల తర్వాత అంత్యక్రియలను నిర్వహిస్తాం. అంత్యక్రియల సమయాన్ని ఇంకా నిర్ణయించలేదు' అని జీవిత తన ప్రకటనలో పేర్కొన్నారు. 9849922944, 9849422944 నంబర్ల ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు.
Go Back to Shorts
Rajasekhar
Jeevitha
Tollywood
Father
Funerals

More Telugu News