Chiranjeevi: 'ఆచార్య' నుంచి నీలాంబరి లిరికల్ సాంగ్ రిలీజ్!

Acharya second single released
  • 'ఆచార్య' నుంచి సెకండ్ సింగిల్
  • మణిశర్మ స్వరకల్పన
  • అనంత శ్రీరామ్ సాహిత్యం  
  • శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ
  • ఫిబ్రవరి 4వ తేదీన సినిమా రిలీజ్
చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమా రూపొందింది. అవినీతి అధికారులపై సమరశంఖం పూరించిన బాధ్యతగల ఒక పౌరుడి కథ ఇది. మాటలతో చెబితే అర్థంకాని అవినీతిపరుల గుండెల్లో తూటాలు నాటిన ఒక వీరుడి కథ ఇది. అలాంటి ఈ సినిమా నుంచి ఆ మధ్య వచ్చిన ఫస్టు సింగిల్ కి రికార్డు స్థాయి రెస్పాన్స్ వచ్చింది.

ఈ సినిమాలో సిద్ధ పాత్రలో చరణ్ .. నీలాంబరి పాత్రలో పూజ హెగ్డే మరో జోడీగా కనిపించనున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్లోని సాంగ్ ను సెకండ్ సింగిల్ గా కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు. 'నీలాంబరి .. నీలాంబరి .. వేరెవ్వరే నీలామరి, అయ్యోరింటి సుందరి .. వయ్యారాల వల్లరి .. నీలాంబరి' అంటూ ఈ పాట సాగుతోంది.

మణిశర్మ స్వరపరిచిన ఈ పాటకి, అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని అందించాడు. అనురాగ్ కులకర్ణి - రమ్య బెహ్రా ఆలపించారు. ఫొటోగ్రఫీ .. కొరియోగ్రఫీ ఈ పాటకు ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచాయి. సాంగ్ మేకింగ్ వీడియోతో కలిపి అందించిన సెకండ్ సింగిల్ ఆకట్టుకునేలా ఉంది. ఫిబ్రవరి 4వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. 
Chiranjeevi
Kajal Agarwal
Ramcharan
Pooja Hegde

More Telugu News