Hero Rajasekhar: హీరో రాజశేఖర్‌ కు పితృవియోగం... తండ్రి వరదరాజన్ కన్నుమూత

Hero Rajasekhar father dies of illness
  • రాజశేఖర్ కుటుంబంలో విషాదం
  • అనారోగ్యంతో తండ్రి వరదరాజన్ మృతి
  • సిటీ న్యూరో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన వైనం
  • భౌతికకాయం రేపు చెన్నైకి తరలింపు

టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్‌కి పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి వరదరాజన్‌ గోపాల్‌ గురువారం సాయంత్రం హైదరాబాదులోని సిటీ న్యూరో సెంటర్‌ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన వయసు 94 సంవత్సరాలు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

వరదరాజన్‌ గోపాల్‌ చెన్నై డీసీపీగా రిటైర్ అయ్యారు. ఆయనకు ఐదుగురు సంతానం. ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. హీరో రాజశేఖర్‌... వరదరాజన్‌ గోపాల్‌కు రెండో సంతానం. శుక్రవారం ఉదయం 6.30 నిమిషాలకు వరదరాజన్‌ గోపాల్‌ భౌతికకాయాన్ని ఫ్లైట్‌లో చెన్నైకు తీసుకెళ్లనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. తండ్రి మరణంతో రాజశేఖర్ విషాదానికి లోనయ్యారు.

  • Loading...

More Telugu News