Thief: "క్షమించమ్మా" అంటూ అంకమ్మ తల్లి ఆలయంలో చోరీ... వీడియో ఇదిగో!

Thief in temple video went viral
  • ఖమ్మంలో ఓ ఆలయంలో దొంగతనం
  • హుండీ పగలగొట్టిన దొంగ
  • అమ్మవారికి నమస్కరించి పని ప్రారంభించిన వైనం
  • సోషల్ మీడియాలో సందడి చేస్తున్న వీడియో
ఖమ్మంలోని ఓ ఆలయంలో జరిగిన దొంగతనం తాలూకు వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. అంకమ్మ ఆలయంలో చోరీకి వచ్చిన దొంగ... అతికష్టమ్మీద హుండీ తాళం పగులగొట్టాడు. ఆపై అంకమ్మ తల్లి పాదాలకు ప్రణామం చేశాడు. "నా తప్పును క్షమించమ్మా, నీకు హారతి ఇస్తా" అంటూ అనడం కూడా రికార్డయింది. తర్వాత ఆ హుండీలో ఉన్నదంతా దోచుకుని ఉడాయించాడు. ఖమ్మం పట్టణంలోని నాలుగో డివిజన్ లో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.
Thief
Temple
Khammam
Video

More Telugu News