Shiva Balaji: మూడు నెలలు పూర్తిగా ఫామ్ లోనే గడిపేశాం: మధుమిత

Shiva Balaji and Madhumitha shares their personal matters
  • 2009లో ప్రేమ వివాహం చేసుకున్న శివ బాలాజీ, మధుమిత
  • అన్యోన్యంగా జీవిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న జంట
  • తమ పెళ్లికి మధు కుటుంబం తొలుత ఒప్పుకోలేదన్న శివ బాలాజీ
టాలీవుడ్ జంటల్లో శివబాలాజీ, మధుమితల జంటకు క్యూటెస్ట్ కపుల్ గా పేరుంది. ప్రేమ వివాహం చేసుకున్న వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. సినిమాల్లో నటిస్తున్నప్పుడు ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఆ తర్వాత తమ కుటుంబాలను ఒప్పించి 2009 మార్చిలో వీరు వైవాహికబంధంలోకి అడుగుపెట్టారు. దీపావళి సందర్భంగా ఓ ఛానల్ తో మాట్లాడుతూ ఈ దంపతులు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

తనకు కోపం ఎక్కువని మధుమిత తనను పెళ్లిచేసుకోవడానికి ఆమె కుటుంబసభ్యులు తొలుత ఒప్పుకోలేదని... ఇప్పుడు తనను వారు పూర్తిగా అర్థం చేసుకున్నారని బాలాజీ చెప్పాడు. పెళ్లైన కొత్తలో ప్రతి దానికీ గొడవ పడేవాళ్లమని... ఆ తర్వాత భార్యాభర్తలు ఎలా ఉండాలో తెలుసుకున్నామని మధు తెలిపింది.

ఇక పప్పుచారు దగ్గర నుంచి పాయా వరకు అన్ని వంటలను మధు అద్భుతంగా వండుతుందని బాలాజీ కితాబునిచ్చాడు. కరోనా టైమ్ లో మూడు నెలల పాటు పూర్తిగా ఫామ్ లోనే గడిపేశామని మధు తెలిపింది. తనకు చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంటే ఇష్టమని... మధు ఫ్యామిలీకి కూడా అదే ఇష్టమని బాలాజీ అన్నాడు. అందరూ దీపావళిని సురక్షితంగా జరుపుకోవాలని ఇద్దరూ కోరారు.
Shiva Balaji
Madhumitha
Tollywood

More Telugu News