TRS: తెలంగాణ‌లోనూ పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు త‌గ్గిస్తారా? లేదా?: బండి సంజ‌య్

narendramodi  ji led Government announces Excise duty reduction on Petrol  Diesel by  and 10 respectively
  • కేంద్రం పెట్రోలుపై రూ.5, లీటరు డీజిలుపై రూ.10 తగ్గించింది
  • బీజేపీ పాలిత రాష్ట్రాలు వ్యాట్ త‌గ్గించాయి
  • మ‌రి తెలంగాణ‌లో టీఆర్ఎస్ సుంకాన్ని త‌గ్గిస్తుందా?
కొన్ని నెల‌లుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ వ‌చ్చిన నేప‌థ్యంలో సామాన్యుడు తీవ్ర ఇబ్బందులు ప‌డ్డాడు. ర‌వాణాపై ఆధార‌ప‌డి ఉన్న అన్ని వస్తువుల ధరలూ పెరిగిపోవ‌డంతో కేంద్ర ప్ర‌భుత్వంపై ప్ర‌తిప‌క్షాలు మండిప‌డ్డాయి. అయితే, దీపావళి పండుగ సందర్భంగా పెట్రోల్, డీజిల్ పై సుంకాన్ని తగ్గిస్తున్నట్లు నిన్న కేంద్ర స‌ర్కారు శుభ‌వార్త చెప్ప‌డంతో సామాన్యుడికి కాస్త ఊర‌ట ల‌భించింది.

లీటరు పెట్రోలుపై రూ.5, లీటరు డీజిలుపై రూ.10 తగ్గిస్తున్నట్లు తెలిపింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సుంకాలను తగ్గించాల‌న్న డిమాండ్ వస్తోంది. తెలంగాణ ప్ర‌భుత్వ‌మూ సుంకాన్ని త‌గ్గించాల‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ డిమాండ్ చేశారు.

'పెట్రోలుపై రూ.5, లీటరు డీజిలుపై రూ.10 తగ్గిస్తున్నట్లు న‌రేంద్ర మోదీజీ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. కేంద్ర ప్ర‌భుత్వం ఈ ప్ర‌క‌ట‌న చేయ‌డంతో బీజేపీ పాలిత రాష్ట్రాలు వ్యాట్ త‌గ్గించాయి. తెలంగాణ‌లోనూ అధికార టీఆర్ఎస్ సుంకాన్ని త‌గ్గిస్తుందా? లేదా?' అని ఆయ‌న ప్ర‌శ్నించారు. కాగా, హుజూరాబాద్ ఎన్నిక వేళ సిలిండ‌ర్ల‌కు దండం పెట్టి వెళ్లి ఓటు వేయాల‌ని టీఆర్ఎస్ త‌మ కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే. ఎన్నిక వేళ పెట్రోల్ ధ‌ర‌ల పెరుగుద‌ల అంశాన్ని ప‌దే ప‌దే ప్ర‌స్తావించింది.
TRS
BJP
Bandi Sanjay

More Telugu News