Kollywood: సినీ నటి త్రిషకు యూఏఈ ‘గోల్డెన్ వీసా’.. తొలి తమిళ నటిగా రికార్డు

Trisha becomes first Tamil actor to receive UAEs golden visa
  • ట్విట్టర్ ద్వారా వెల్లడించిన నటి
  • చాలా ఆనందంగా ఉందన్న త్రిష
  • ట్విట్టర్‌లో శుభాకాంక్షల వెల్లువ
ప్రముఖ సినీనటి త్రిషకు అరుదైన గౌరవం లభించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం జారీ చేసే గోల్డెన్ వీసా లభించింది. ఫలితంగా ఈ వీసా అందుకున్న తొలి తమిళనటిగా త్రిష రికార్డులకెక్కారు. త్రిష ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. యూఏఈ నుంచి గోల్డెన్ వీసా అందుకున్న తొలి నటిని తానే కావడం ఆనందంగా ఉందన్నారు. ఆమె ఈ విషయాన్ని వెల్లడించగానే ‘క్వీన్ ఆఫ్ కోలీవుడ్’కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

ఫర్హాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, బోనీకపూర్, అర్జున్ కపూర్, జాన్వీ కపూర్, నేహా కక్కర్, అమాల్ మల్లిక్, మోహన్‌లాల్, మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, ప్రముఖ నేపథ్య గాయని కేఎస్ చిత్ర వంటివారు ఇప్పటి వరకు యూఏఈ గోల్డెన్ వీసా అందుకున్నారు. తమిళ చిత్ర పరిశ్రమ నుంచి గోల్డెన్ వీసా అందుకున్న తొలి నటి మాత్రం త్రిషనే.  

ఏంటీ గోల్డెన్ వీసా?
2019 నుంచి యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాలు జారీ చేయడం మొదలుపెట్టింది. ఈ వీసా కలిగినవారు యూఏఈలో సుదీర్ఘకాలం నివాసం ఉండొచ్చు. ఇన్వెస్టర్లు, వ్యాపారవేత్తలు, సైన్స్, క్రీడలు, తెలివితేటలు వంటి ప్రత్యేక నైపుణ్యం కలిగినవారు, ప్రొఫెషనల్స్‌ ఈ గోల్డెన్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వీటిని 5 లేదంటే 10 ఏళ్ల కాలపరిమితితో జారీ చేస్తారు. కాలపరిమితి ముగిశాక వాటంతట అవే రెన్యువల్ అవుతాయి.
Kollywood
Trisha
UAE
Golden Visa

More Telugu News