Sourav Ganguly: భారత క్రికెట్ ను ద్రావిడ్ అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్తాడు: గంగూలీ

Dravid will take Indian Cricket to heights says Ganguly
  • టీమిండియా హెడ్ కోచ్ గా ద్రావిడ్ నియామకం 
  • తన మిత్రుడిపై ప్రశంసలు కురిపించిన గంగూలీ
  • ప్రపంచ క్రికెట్ దిగ్గజాలలో ద్రావిడ్ ఒకరని కితాబు

టీమిండియా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ నియమితులైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా... గతంలో ఆయన సహచర ఆటగాడు, ప్రస్తుత బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ మాట్లాడుతూ, టీమిండియా హెడ్ కోచ్ గా ద్రావిడ్ ను స్వాగతిస్తున్నామని చెప్పారు. సుదీర్ఘమైన ప్లేయింగ్ కెరియర్ ద్రావిడ్ సొంతమని అన్నారు. క్రికెట్ చరిత్రలోని దిగ్గజాలలో ద్రావిడ్ ఒకరని కొనియాడారు.

నేషనల్ క్రికెట్ అకాడెమీ (ఎన్సీఏ) హెడ్ గా ద్రావిడ్ అద్భుతమైన సేవలందించారని చెప్పారు. ద్రావిడ్ నేతృత్వంలో ఎందరో యంగ్ ప్లేయర్స్ భారత జట్టుకు ఎంపికై, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని అన్నారు. ద్రావిడ్ మార్గదర్శకత్వంలో టీమిండియా ఎన్నో విజయాలను సాధిస్తుందని... భారత క్రికెట్ ను ద్రావిడ్ అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్తాడనే నమ్మకం తనకు ఉందని చెప్పారు.

  • Loading...

More Telugu News