ఏపీలో గత 24 గంటల్లో 326 కరోనా కేసుల నమోదు

  • చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 68 కేసులు 
  • రాష్ట్ర వ్యాప్తంగా నలుగురి మృతి
  • రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,898
ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటల్లో కొత్తగా 326 కరోనా కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 68 కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. విజయనగరం జిల్లాలో కేవలం ఒక్క కేసు మాత్రమే నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా నలుగురు కరోనా కారణంగా మృతి చెందారు. 466 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు ఏపీలో నమోదైన కేసుల సంఖ్య 20,67,255కి పెరిగింది. ఇప్పటి వరకు 20,48,971 మంది కోలుకోగా... 14,386 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,898 యాక్టివ్ కేసులు ఉన్నాయి.


More Telugu News

Andhra Pradesh Corona Virus Updates