Andhra Pradesh: అగ్రవర్ణ పేదల కోసం ఏపీలో ప్రత్యేక సంక్షేమ శాఖ

AP Govt Issues GO To Set Up Special Department For EWS
  • ‘ఈడబ్ల్యూఎస్’ శాఖను ఏర్పాటు చేసిన ప్రభుత్వం
  • శాఖ పరిధిలోకి కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ, క్షత్రియ, కాపు, ఆర్యవైశ్య కార్పొరేషన్లు  
  • జైనులు, సిక్కుల సంక్షేమం కోసమూ ప్రత్యేక కార్పొరేషన్లు
అగ్రవర్ణాల్లోని పేదల కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసింది. వారి సంక్షేమం కోసం ‘ఈడబ్ల్యూఎస్ (ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు)’ శాఖను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఈడబ్ల్యూఎస్ వర్గాల కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసే విషయంపై రాష్ట్ర కేబినెట్ కొన్ని రోజుల క్రితం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే ఈడబ్ల్యూఎస్ శాఖను ఏర్పాటు చేస్తూ సాధారణ పరిపాలన విభాగం జీవో ఇచ్చింది. ఈ శాఖ పరిధిలోకి కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ, క్షత్రియ, కాపు, ఆర్యవైశ్య కార్పొరేషన్లను తీసుకువచ్చారు. జైనులు, సిక్కుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తూ మరో రెండు జీవోలను జారీ చేసింది.
Andhra Pradesh
YSRCP
YS Jagan

More Telugu News