Atchannaidu: అచ్చెన్నాయుడితో పాటు ఎంపీ రామ్మోహన్‌ నాయుడిపై టెక్కలి పోలీస్ స్టేషన్‌లో కేసు

case against atchennaidu
  • నిన్న నందిగామలో ఎన్టీఆర్, ఎర్రన్నాయుడు విగ్రహాల ఆవిష్కరణ
  • ఆ ప్రాంతంలో టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ర్యాలీ
  • నిబంధ‌న‌లు ఉల్లంఘించార‌ని కేసు
టీడీపీ ఆంధ్రప్ర‌దేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడితో పాటు ఆ పార్టీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడిపై టెక్కలి పోలీస్ స్టేషన్‌లో కేసు న‌మోద‌యింది. మ‌రో 48 మంది టీడీపీ కార్యకర్తలపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిన్న నందిగామలో ఎన్టీఆర్, ఎర్రన్నాయుడు విగ్రహాల ఆవిష్కరణ కార్య‌క్ర‌మాన్ని టీడీపీ నిర్వ‌హించింది.

ఈ సంద‌ర్భంగా ఆ ప్రాంతంలో టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ర్యాలీ నిర్వ‌హించారు. క‌రోనా వేళ వారు నిబంధ‌న‌లు ఉల్లంఘించార‌ని, అలాగే, మోటార్ వాహన చట్టాన్ని ఉల్లంఘించార‌ని వీఆర్వో ఆరంగి మల్లేశ్వరరావు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు న‌మోదు చేసిన టెక్క‌లి పోలీసులు ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు.
Atchannaidu
Telugudesam
Andhra Pradesh

More Telugu News