Eatala Rajendar: ఈటల విజయంతో తెలంగాణ బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద మిన్నంటిన సంబరాలు

Celebrations at Telangana BJP office after Eatala win in Huzurabad
  • హుజూరాబాద్ లో బీజేపీ విజయం
  • 24 వేలకు పైగా ఓట్లతో ఈటల విక్టరీ
  • బీజేపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు
  • బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్న కార్యకర్తలు
హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ 24,068 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈటల గెలుపుతో తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద సంబరాలు మిన్నంటాయి. బీజేపీ కార్యకర్తలు బాణసంచా కాల్చి తమ సంతోషం వ్యక్తం చేశారు. ఈటల విజయాన్ని పురస్కరించుకుని మిఠాయిలు పంచుకున్నారు.

బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల విజయంపై స్పందించారు. అవినీతి టీఆర్ఎస్ ప్రభుత్వ అక్రమాలు, అధికార దుర్వినియోగం, ప్రలోభాలను ఎదిరించి ఈటల ఘనవిజయం సాధించారని కొనియాడారు. బీజేపీని గెలిపించిన హుజూరాబాద్ ప్రజలకు, ఈ గెలుపు కోసం కృషి చేసిన నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.
Eatala Rajendar
Huzurabad
BJP
Bandi Sanjay
Telangana

More Telugu News