Balakrishna: హైదరాబాద్ కేర్ ఆసుపత్రిలో నందమూరి బాలకృష్ణకు శస్త్రచికిత్స

Balakrishna undergoing surgery in Hyderabad Care Hospital
  • కొంతకాలంగా భుజంనొప్పితో బాధపడుతున్న బాలకృష్ణ
  • అక్టోబరు 31న కేర్ ఆసుపత్రిలో చేరిక
  • 4 గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులు
  • కోలుకోవడంతో నేడు డిశ్చార్జి
టాలీవుడ్ సీనియర్ కథానాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు హైదరాబాద్ కేర్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స నిర్వహించారు. బాలకృష్ణ గత కొంతకాలంగా భుజం నొప్పితో బాధపడుతున్నారు. శస్త్రచికిత్స చేయాలని వైద్యులు చెప్పడంతో గత నెల 31న కేర్ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు కేర్ వైద్య నిపుణుల బృందం విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించింది. 4 గంటల పాటు జరిగిన ఈ శస్త్రచికిత్సలో ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సల నిపుణుడు డాక్టర్ రఘువీర్ రెడ్డి, డాక్టర్ బీఎన్ ప్రసాద్ పాల్గొన్నారు.

శస్త్రచికిత్స అనంతరం బాలకృష్ణ కోలుకోవడంతో నేడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు బాలయ్యకు సూచించారు. కాగా, బాలకృష్ణకు 2018లోనూ కుడిచేతికి రొటేటింగ్ కఫ్ సమస్య రావడంతో కాంటినెంటల్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స నిర్వహించారు.
Balakrishna
Surgery
Care Hospital
Hyderabad
Tollywood
TDP

More Telugu News