Juior Soundarya: ఈ అమ్మాయిని చూస్తే... 'అచ్చం సౌందర్యలా ఉందే' అంటారు!

Junior Soundarya in social media

  • సోషల్ మీడియాలో ఆకట్టుకుంటున్న చిత్ర
  • టిక్ టాక్ లో స్టార్ డమ్
  • సౌందర్యను తలపిస్తున్న భారత సంతతి అమ్మాయి
  • సౌందర్య పాటలు, డైలాగులతో టిక్ టాక్ వీడియోలు

దక్షిణాదికి చెందిన గొప్ప నటీమణుల్లో సౌందర్యది చెరగని స్థానం. ఆమె మన మధ్య లేకపోయినా, ఆమె నటించిన చిత్రాలు అభిమానులను నేటికీ అలరిస్తుంటాయి. తాజాగా, మలేసియాకు చెందిన ఓ అమ్మాయి సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సౌందర్యలా ఉండడమే అందుకు కారణం. నిజంగానే ఆమెను చూస్తే  "అరె అచ్చం సౌందర్యలా ఉందే!" అనకమానరు.

ఆమె పేరు చిత్ర. ఓ ఎంటర్ ప్రెన్యూర్. మలేసియాలో జన్మించిన భారత సంతతి అమ్మాయి చిత్ర టిక్ టాక్ లో స్టార్ డమ్ అందుకుంది. సౌందర్యలా కనిపించే ఈ అమ్మడు... సౌందర్య నటించిన సినిమాల్లోని పాటలు, డైలాగులు, సీన్లతో టిక్ టాక్ వీడియోలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ఇన్ స్టాగ్రామ్ లో చిత్రను 79 వేలమందికి పైగా అనుసరిస్తుండడం విశేషం. సౌందర్యలా కనిపించడమే కాదు, తన వీడియోల్లో సౌందర్యలా హావభావాలు ప్రదర్శించడం ఆమె ప్రత్యేకత. దాంతో నెటిజన్లు ఆమెకు 'జూనియర్ సౌందర్య' అంటూ నామకరణం చేశారు.

Juior Soundarya
Chitra
Malaysia
TikTok
Tollywood
  • Loading...

More Telugu News