Huzurabad: హుజూరాబాద్ ఫలితాలు.. టీఆర్ఎస్, బీజేపీలను దెబ్బకొట్టిన రోటీమేకర్, వజ్రం గుర్తులు!

Roti maker and diamond symbols damaged TRS and BJP voting in Huzurabad
  • కారును పోలిన రోటీమేకర్ గుర్తు
  • కమలంను పోలిన వజ్రం గుర్తు
  • ప్రధాన పార్టీలకు ఇద్దరు ఇండిపెండెంట్ల దెబ్బ
హుజూరాబాద్ ఉపఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు మూడు రౌండ్ల ఫలితాలు వెలువడగా... మూడు రౌండ్లలో కూడా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యతను సాధించారు. మరోవైపు ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీలకు ఇండిపెండెంట్లు తలనొప్పిగా మారారు. ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులకు కేటాయించిన రోటీ మేకర్, వజ్రం గుర్తులు ఈ పార్టీల కొంప ముంచాయి.

రోటీ మేకర్ గుర్తు కారును పోలి ఉండటం, వజ్రం గుర్తు కమలంను పోలి ఉండటం ఆ పార్టీ ఓట్లపై ప్రభావాన్ని చూపాయి. ఓటర్లు కొంతమేర ఈ గుర్తులను చూసి కన్ఫ్యూజ్ అయ్యారని చెప్పుకోవచ్చు. మూడో రౌండ్ ముగిసే సరికి రోటీ మేకర్ కు 300కు పైగా ఓట్లు, వజ్రంకు 200కు పైగా ఓట్లు పడ్డాయి.
Huzurabad
BJP
Congress
Symbols
Roti Maker
Diamond
Etela Rajender

More Telugu News