Nagarjuna: 'బంగార్రాజు'లో తాతామనవళ్లుగా తండ్రీకొడుకులు!

Bangarraju Movie Update
  • నాగ్ - చైతూ హీరోలుగా 'బంగార్రాజు'
  • జోరుగా జరుగుతున్న షూటింగు
  • దర్శకుడిగా కల్యాణ్ కృష్ణ
  • సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు    
నాగార్జున కథానాయకుడిగా 'బంగార్రాజు' సినిమా రూపొందుతోంది. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, ప్రస్తుతం జోరుగా షూటింగు జరుపుకుంటోంది. గ్రామీణ నేపథ్యంలో పల్లెటూరి బుల్లోడుగా ఈ సినిమాలో నాగార్జున కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలో నాగచైతన్య కూడా నటిస్తున్నాడు.

నాగార్జున సరసన నాయికగా రమ్యకృష్ణ నటిస్తుండగా, చైతూ జోడీగా కృతి శెట్టి కనిపించనుంది. ఈ సినిమాలో నాగార్జున - చైతూ తండ్రీ కొడుకులుగానే కనిపించవచ్చని అంతా అనుకున్నారు. కానీ వాళ్లిద్దరూ ఈ సినిమాలో తాతామనవళ్లుగా కనిపించనున్నారని అంటున్నారు. అంతవరకూ బాగానే ఉంది.

కానీ ఇప్పుడు తాత చైతూ అయితే, మనవడు నాగార్జున అంటున్నారు. ఇందులో వాస్తవమెంతో మరి. స్వర్గం సెట్లో రంభ .. ఊర్వశి .. మేనకల మధ్య రొమాంటిక్ సాంగ్ లు అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Nagarjuna
Ramyakrishna
Chaithu
Krithi Shetty

More Telugu News