Mekathoti Sucharitha: ఇదేనా జనసేన పార్టీ విధానం?: ఏపీ హోంమంత్రి సుచరిత

Home Minister Mekathoti Sucharitha slams Pawan Kalyan and Janasena
  • విశాఖ ఉక్కు దీక్షకు పవన్ మద్దతు
  • కూర్మన్నపాలెం సభలో వైసీపీ నేతలపై విమర్శలు
  • స్పందించిన హోంమంత్రి సుచరిత
  • పవన్ ది స్థిరత్వంలేని సిద్ధాంతమని వ్యాఖ్యలు

విశాఖ ఉక్కు పరిశ్రమకు మద్దతు ప్రకటిస్తూ, కూర్మన్నపాలెం సభలో వైసీపీ నేతలపై పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రజాప్రతినిధులు పవన్ పై మండిపడుతున్నారు. తాజాగా హోంమంత్రి మేకతోటి సుచరిత స్పందించారు. అసలు, జనసేన విధానాలు ఏంటో ఎవరికీ అర్థంకావడంలేదని అన్నారు. బీజేపీతో కేంద్రంలో మైత్రి... రాష్ట్రంలో శత్రుత్వమా? అంటూ విమర్శించారు.

పవన్ దీక్ష ఎందుకో తెలియడంలేదని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ కు సిద్ధాంతపరంగా నిలకడలేదని అన్నారు. జనసేనను ప్రజలు నమ్మబోవడంలేదని స్పష్టం చేశారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై కేంద్రంతోనే మాట్లాడి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేయొచ్చు కదా! అని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News