Bandi Sanjay: మాకు అందిన సమాచారం మేరకు హుజూరాబాద్ లో బీజేపీ భారీ మెజారిటీతో గెలవబోతోంది: బండి సంజయ్

Bandi Sanjay opines on Huzurabad By Polls
  • హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక
  • ముగిసిన పోలింగ్
  • ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీకే మొగ్గు
  • పార్టీ శ్రేణులు తీవ్రంగా శ్రమించాయన్న బండి సంజయ్
హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసిన అనంతరం తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ట్విట్టర్ లో స్పందించారు. కేసీఆర్ అహంకారానికి, హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరిగిన పోరుగా హుజూరాబాద్ ఉప ఎన్నికను అభివర్ణించారు. పార్టీ శ్రేణుల నుంచి అందిన సమాచారం ప్రకారం బీజేపీ భారీ మెజారిటీతో గెలవబోతోందని వెల్లడించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో తమకు ఓటేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.  

బీజేపీ విజయం కోసం పార్టీ నేతలు, కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారని, వారందరికీ ధన్యవాదాలు అంటూ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ అప్రజాస్వామికంగా వ్యవహరించిందని, ఎన్నికల నియమావళికి విరుద్ధంగా నడుచుకుందని ఆరోపించారు. ఓట్లను అడ్డగోలుగా కొనేందుకు ప్రయత్నించిందని వెల్లడించారు. అయితే హుజూరాబాద్ ప్రజలు విజ్ఞత గలవారని, చైతన్యవంతంగా ఆలోచించి న్యాయం, ధర్మం వైపే మొగ్గు చూపారని పేర్కొన్నారు.
Bandi Sanjay
Huzurabad
BJP
TRS
KCR
Telangana

More Telugu News