Nani: 'ఓసీఎఫ్ఎస్' టీజర్ ను రేపు లాంచ్ చేయనున్న నేచురల్ స్టార్ నాని!

Nani to launch OCFS teaser tomorrow
  • నిహారిక నిర్మాతగా ఓసీఎఫ్ఎస్ వెబ్ సిరీస్
  • జీ5లో నవంబర్ 19 నుంచి స్ట్రీమింగ్
  • రేపు మధ్యాహ్నం 11 గంటలకు టీజర్ విడుదల చేయనున్న నాని
కొణిదెల నిహారిక నిర్మాతగా వ్యవహరించిన 'ఓసీఎఫ్ఎస్ (ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ)' వెబ్ సిరీస్ నవంబర్ 19న జీ5లో స్ట్రీమింగ్ కానుంది. పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైన్ మెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ వెబ్ సిరీస్ లో 40 నిమిషాల నిడివితో మొత్తం 5 ఎపిసోడ్లు ఉంటాయి. ఈ వెబ్ సీరీస్ కు సంబంధించిన టీజర్ ను రేపు ఉదయం 11 గంటలకు నేచురల్ స్టార్ నాని విడుదల చేయనున్నారు ఈ సిరీస్ లో ప్రముఖ నటీనటులు నరేశ్, తులసి తదితరులు కీలక పాత్రలను పోషించగా... సంతోష్ శోభన్, సిమ్రన్ శర్మ హీరో, హీరోయిన్లుగా నటించారు.
Nani
Tollywood
Teaser
Niharika
OCFS

More Telugu News