OCFS: నవంబర్ 19 నుంచి కొణిదెల నిహారిక 'ఓసీఎఫ్ఎస్' స్ట్రీమింగ్ ప్రారంభం!

  • జీ5లో టెలికాస్ట్ కానున్న 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ'
  • ఈ సిరీస్ కు నిర్మాతగా వ్యవహరిస్తున్న నిహారిక
  • 40 నిమిషాల నిడివితో మొత్తం 5 ఎపిసోడ్లు
Konidela Niharika production OCFS series to start from November 19 in ZEE5

మెగా డాటర్ నిహారిక పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు, టీవీ షోలకు దూరమైన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె 'ఓసీఎఫ్ఎస్' వెబ్ సిరీస్ తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయితే ఈ వెబ్ సిరీస్ లో ఆమె నటించడం లేదు. దీనికి ఆమె నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 'ఓసీఎఫ్ఎస్' అంటే 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ'. ఒక పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్ మెంట్ స్టోరీతో ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ వెబ్ సిరీస్ లో 40 నిమిషాల నిడివితో మొత్తం 5 ఎపిసోడ్లు ఉంటాయి. ఈ వెబ్ సిరీస్ తొలి ఎపిసోడ్ ప్రీమియర్స్ జీ5లో నవంబర్ 19న ప్రారంభం కానున్నాయి.

ఈ సందర్భంగా నిహారిక ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... 'అమ్మ నాన్న ఒక బేవార్స్ కొడుకు'కు మించి ఉంటుంది వీళ్ల 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' అని అన్నారు. ఈ సిరీస్ లో సంతోష్ శోభన్, సిమ్రన్ శర్మ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. సీనియర్ నటీనటులు నరేశ్, తులసి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సిరీస్ ప్రేక్షకులను అలరిస్తుందని యూనిట్ సభ్యులు ధీమాగా ఉన్నారు.

More Telugu News