Chandrababu: కుప్పం సభలో ఆగంతుకుడి కలకలం.... చంద్రబాబును కవర్ చేసిన కమాండోలు

Unidentified man creates  ruckus in Chandrababu rally in Kuppam
  • కుప్పంలో చంద్రబాబు సభ
  • అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తి
  • పట్టుకున్న టీడీపీ కార్యకర్తలు
  • గుర్తుతెలియని వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించారు. కుప్పంలో భారీ సభ సందర్భంగా ఓ ఆగంతుకుడు కలకలం సృష్టించాడు. చంద్రబాబు సభ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో అతడిని టీడీపీ కార్యకర్తలు నిర్బంధించారు. బాంబు తెచ్చేడేమోనన్న అనుమానంతో అతడిని పోలీసులకు అప్పగించారు. అతడి వద్ద రాళ్లు ఉన్నట్టు గుర్తించారు. ఈ క్రమంలో, అప్పటివరకు వెనుక నిల్చున్న కమాండోలు ఒక్కసారిగా ముందుకు వచ్చి చంద్రబాబు చుట్టూ కవచంలా నిలిచారు.

ఈ సభలో చంద్రబాబు మాట్లాడుతూ,  బాబాయ్ ని చంపిననోడికి భయం కానీ, మనకెందుకు భయం అంటూ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా వైసీపీ గూండాయిజం నశించాలి, సీఎం డౌన్ డౌన్ అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. అటు చంద్రబాబు పర్యటన సందర్భంగా కుప్పంలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఉద్రిక్తత ఏర్పడింది. ఒకరి ఫ్లెక్సీలను మరొకరు పరస్పరం ధ్వంసం చేసుకున్నారు.
Chandrababu
Kuppam
Commandos
TDP

More Telugu News