Priyanka Gandhi: ఎరువుల కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలను పరామర్శించిన ప్రియాంకాగాంధీ

Priyanka Gandhi meets families of died farmers families
  • యూపీలోని లలిత్ పూర్ లో నలుగురు రైతుల మృతి
  • యోగి ప్రభుత్వంపై మండిపడ్డ ప్రియాంకాగాంధీ
  • బుందేల్ ఖండ్ ప్రాంతం ఎరువుల కొరతతో బాధపడుతోందని వ్యాఖ్య
ఎరువుల కోసం క్యూలో గంటల సేపు నిలబడి, అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయిన నలుగురు రైతుల కుటుంబాలను కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ ఈరోజు పరామర్శించారు. ఉత్తరప్రదేశ్ లోని లలిత్ పూర్ కు వెళ్లిన ఆమె రైతు కుటుంబాలను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలోని బుందేల్ ఖండ్ ప్రాంతం మొత్తం తీవ్రమైన ఎరువుల కొరతతో బాధపడుతోందని విమర్శించారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ఇప్పటికే ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు ప్రియాంకాగాంధీ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు.
Priyanka Gandhi
Congress
Uttar Pradesh
Farmers Deaths

More Telugu News