Palamuru Rangareddy: గ్రీన్ ట్రైబ్యునల్ లో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు!

NGT orders TS govt to stop Palamuru Rangareddy project works
  • పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులను నిలిపివేయాలన్న ఎన్జీటీ
  • ప్రాజెక్టు అక్రమమంటూ ఏపీ ప్రభుత్వం అభ్యంతరం
  • కేంద్ర అటవీశాఖ అనుమతులు తప్పనిసరి అన్న ట్రైబ్యునల్

తెలంగాణ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) షాకిచ్చింది. పర్యావరణ అనుమతులు లేకుండా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్లొద్దని టీఎస్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే... తాగునీటి కోసం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిందని, అయితే ప్రాజెక్టును సాగునీటి కోసం విస్తరించిందంటూ ఏపీ సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది అక్రమమంటూ గ్రీన్ ట్రైబ్యునల్ ను ఆశ్రయించింది. దీంతో ప్రాజెక్టు పనులను నిలిపివేయాలంటూ ట్రైబ్యునల్ ఆదేశించింది. ప్రాజెక్టుకు కేంద్ర అటవీశాఖ అనుమతులు తప్పనిసరి అని స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News