Revanth Reddy: తెలంగాణ జోలికి వస్తే ఖబడ్దార్... కేసీఆర్, పేర్ని నానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన రేవంత్ రెడ్డి

Revanth Reddy warns KCR and Perni Nani
  • ఏపీలో టీఆర్ఎస్ పార్టీ పెడతామన్న కేసీఆర్
  • రెండు రాష్ట్రాలను కలిపేయాలన్న పేర్ని నాని
  • తెలంగాణను బలిచ్చే కుట్ర జరుగుతోందన్న రేవంత్ రెడ్డి
  • కేసీఆర్ ది రాజ్యవిస్తరణ కాంక్ష అంటూ విమర్శలు
ఏపీలోనూ తమ పాలన కోరుకుంటున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల వ్యాఖ్యానించగా, ఏపీ మంత్రి పేర్ని నాని స్పందిస్తూ... సీఎం కేసీఆర్ ఏపీలో పార్టీ పెడితే తాము స్వాగతిస్తామని, అయితే రెండు రాష్ట్రాలను కలిపేసేలా ఆయన ఓ తీర్మానం చేస్తే బాగుంటుందని అన్నారు. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వందల మంది ఆత్మ బలిదానాలతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని, అలాంటి తెలంగాణ జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు.

కేసీఆర్ రాజ్య విస్తరణ కాంక్షకు తెలంగాణను బలిచ్చే కుట్ర జరుగుతోందని రేవంత్ ఆరోపించారు. టీఆర్ఎస్ ప్లీనరీలో తెలుగుతల్లి ప్రత్యక్షం కావడం, మంత్రి పేర్ని నాని సమైక్య రాష్ట్ర ప్రతిపాదన తీసుకురావడం కేసీఆర్, జగన్ ల ఉమ్మడి కుట్రలో భాగమని మండిపడ్డారు. ఈ మేరకు రేవంత్ ట్వీట్ చేశారు. కేసీఆర్, పేర్ని నానిల కామెంట్లను కూడా వీడియో రూపంలో పంచుకున్నారు.
Revanth Reddy
KCR
Perni Nani
TRS
Telangana
Andhra Pradesh

More Telugu News