Rajinikanth: వైద్య పరీక్షల కోసం చెన్నై కావేరీ ఆసుపత్రిలో చేరిన రజనీకాంత్

Rajinikanth admitted into Chennai Kauvery hospital
  • ఈ సాయంత్రం కావేరీ ఆసుపత్రికి వచ్చిన రజనీ
  • హెల్త్ చెకప్ కోసమేనని రజనీ టీమ్ వెల్లడి
  • కొంతకాలంగా రజనీకి ఆరోగ్య సమస్యలు
  • గతేడాది హైదరాబాదులో చికిత్స
దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరారు. ఈ సాయంత్రం 4.30 గంటలకు రజనీకాంత్ ఆసుపత్రిలో చేరినట్టు కావేరీ హాస్పిటల్స్ వర్గాలు వెల్లడించాయి. అయితే రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందాల్సింది ఏమీలేదని, సాధారణ హెల్త్ చెకప్ కోసమే ఆసుపత్రికి వచ్చారని ఆయన ప్రతినిధులు తెలిపారు.

గత కొన్నాళ్లుగా రజనీకాంత్ రక్తపోటులో హెచ్చుతగ్గుల సమస్య ఎదుర్కొంటున్నారు. గతేడాది కూడా హైదరాబాద్ లో షూటింగ్ కోసం వచ్చి అస్వస్థతకు గురై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందారు. అనారోగ్య కారణాల వల్లే రాజకీయ పార్టీ ఏర్పాటు నిర్ణయాన్ని కూడా రజనీ ఉపసంహరించుకున్నారు. ఇటీవలే ఆయన ఢిల్లీలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్నారు.
Rajinikanth
Kauvery Hospital
Health Checkup
Chennai
Kollywood
Tamilnadu

More Telugu News