Telangana: తెలంగాణలో రెండు ఏవై 4.2 వేరియంట్ కేసుల గుర్తింపు!

Corona AY variant found in Telangana
  • సెప్టెంబర్ లో కరోనా బాధితుల 274 రక్తనమూనాల పరీక్ష
  • ఇద్దరిలో ఏవై4.2 రకం గుర్తింపు
  • వీరిలో ఒకరు 22 ఏళ్ల మహిళ
రష్యా, బ్రిటన్ లలో కరోనా కేసులు మళ్లీ పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. ఏవై4.2 వేరియంట్ ఈ దేశాలను వణికిస్తోంది. ఈ తరహా వైరస్ మన దేశంలో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో బయటపడింది. తాజాగా తెలంగాణలో కూడా ఈ వైరస్ ను గుర్తించారు. ఇద్దరిలో ఈ తరహా వైరస్ ను గుర్తించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలోని జీఐఎస్ఏఐడీ తెలిపింది.

 గత నెలలో తెలంగాణలో నమోదైన కేసులకు చెందిన 274 మంది రక్త నమూనాలను హైదరాబాదులోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ లేబొరేటరీలో జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపగా.. వీటిలో రెండు ఏవై4.2 రకం కేసులు ఉన్నట్టు తేలిందని వెల్లడించింది. ఈ రెండు కేసులు 48 ఏళ్ల పురుషుడు, 22 ఏళ్ల మహిళవి. అయితే ఈ రెండు కేసుల వివరాలను గోప్యంగా ఉంచారు. వారు ఇప్పుడు ఎలా ఉన్నారు? వారు పూర్తిగా కోలుకున్నారా? అనే విషయాల్లో క్లారిటీ లేదు.
Telangana
AY 4.2
Corona Virus

More Telugu News