Chiranjeevi: 'రంగమార్తాండ' చిత్రం కోసం గొంతు అరువిచ్చిన చిరంజీవి

Chiranjeevi lends his voice for Ranga Marthanda
  • కృష్ణవంశీ దర్శకత్వంలో 'రంగమార్తాండ'
  • వాయిస్ ఓవర్ చెప్పిన చిరంజీవి
  • ప్రధాన పాత్రలను పరిచయం చేసిన వైనం!
  • చిరంజీవికి కృతజ్ఞతలు చెప్పిన కృష్ణవంశీ

ప్రకాశ్ రాజ్ ప్రధానపాత్రలో కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'రంగమార్తాండ'. మరాఠీలో హిట్టయిన 'నటసామ్రాట్' చిత్రానికి రీమేక్ గా 'రంగమార్తాండ' రూపొందిస్తున్నారు. కాగా, ఈ చిత్రం కోసం మెగాస్టార్ చిరంజీవి తన గొంతు అరువిచ్చారు. ఇందులోని ప్రధాన పాత్రలను పరిచయం చేస్తూ చిరంజీవి వాయిస్ ఓవర్ చెప్పినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని దర్శకుడు కృష్ణవంశీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

అడగ్గానే ఒప్పుకుని, మరేమీ అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా తమ చిత్రంలో వాయిస్ ఓవర్ చెప్పినందుకు థాంక్యూ అన్నయ్యా అంటూ కృతజ్ఞతలు తెలిపారు. మెగా వాయిస్ 'రంగమార్తాండ' వినీలాకాశంలో మరో వెలుగు దివ్వె అని అభివర్ణించారు. 'రంగమార్తాండ' చిత్రంలో ప్రకాశ్ రాజ్ తో పాటు రమ్యకృష్ణ, అనసూయ, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక రాజశేఖర్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

  • Loading...

More Telugu News