Pattabhi: మాల్దీవుల్లో పట్టాభి.. వెళ్లడానికి కారణం ఇదేనట!

TDP leader Pattabhi went to Maldives with familly
  • బెయిల్ పై విడుదలైన పట్టాభి
  • ప్రశాంతత కోసం విహారయాత్రకు వెళ్దామని కోరిన పట్టాభి భార్య
  • కుటుంబంతో కలిసి మాల్దీవులకు వెళ్లిన పట్టాభి
సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసులో టీడీపీ నేత పట్టాభికి కోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. అయితే, హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి విడుదలైన ఆయన ఆ తర్వాత కనిపించకుండా పోయారు. పట్టాభి ఎక్కడ? అనే చర్చ కూడా పెద్ద ఎత్తున సాగింది.

ఈ క్రమంలో తన కుటుంబంతో కలిసి మాల్దీవుల్లో ఆయన ప్రత్యక్షమయ్యారు. కుటుంబసభ్యులతో కలిసి మాలే విమానాశ్రయంలో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రశాంతత కోసం విహారయాత్రకు వెళ్దామని ఆయనను భార్య చందన కోరినట్టు సమాచారం. భార్య కోరిక మేరకు పట్టాభి మాల్దీవులకు వెళ్లారు.

మరోవైపు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, బెయిల్ ఇచ్చే సందర్భంగా పట్టాభికి కోర్టు ఎలాంటి షరతులు విధించలేదని... దీంతో ఎక్కడికైనా వెళ్లే స్వేచ్ఛ పట్టాభికి ఉంటుందని చెప్పారు. ఇంకోవైపు పట్టాభిని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను విజయవాడలోని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఈనెల 28కి వాయిదా వేసింది.
Pattabhi
Telugudesam
Maldives

More Telugu News