టాలీవుడ్ లోకి అకీరా ఎంట్రీ... తండ్రి పవన్ తో కలిసి ఒకే చిత్రంలో కనిపించనున్న తనయుడు?
- 'హరిహర వీరమల్లు' చిత్రంలో నటిస్తున్న పవన్ కల్యాణ్
- క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం
- ఓ ప్రధాన పాత్రలో అకీరా కనిపించబోతున్నాడంటూ ప్రచారం
తన తండ్రి పవన్ నటిస్తున్న 'హరిహర వీరమల్లు' చిత్రంలో అకీరా కనిపించనున్నాడనే వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. క్రిష్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో అకీరా ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడని చెపుతున్నారు. తన పాత్ర కోసం అకీరా కర్రసాము నేర్చుకుంటున్నాడని అంటున్నారు. ఇదే నిజమైతే... పవన్ ఫ్యాన్స్ కు పండగే.