Afghanistan: టీ20 వరల్డ్ కప్ లో నేడు ఆప్ఘనిస్థాన్ వర్సెస్ స్కాట్లాండ్

Afghanistan faces Scotland in super twelve stage
  • కొనసాగుతున్న సూపర్-12 పోటీలు
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్థాన్
  • షార్జాలో జరుగుతున్న మ్యాచ్
  • పిచ్ పొడిగా ఉందన్న ఆఫ్ఘన్ సారథి

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ సూపర్-12లో భాగంగా నేడు ఆఫ్ఘనిస్థాన్, స్కాట్లాండ్ జట్లు తలపడుతున్నాయి. షార్జా వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆఫ్ఘన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ చాలా పొడిగా కనిపిస్తోందని, బ్యాటింగ్ కు అనుకూలిస్తుందని భావిస్తున్నామని ఆఫ్ఘన్ కెప్టెన్ మహ్మద్ నబీ తెలిపాడు.

ఛేదనలో తమ బౌలర్లు స్కాట్లాండ్ ను కట్టడి చేస్తారని ఆశిస్తున్నట్టు వివరించాడు. స్కాట్లాండ్ సారథి కైల్ కోయెట్జర్ స్పందిస్తూ... ఛేజింగ్ చేయాల్సి రావడం పట్ల చాలా సంతోషిస్తున్నామని అన్నాడు. ఇటీవల ఐపీఎల్ లో ఛేజింగ్ చేసిన జట్లే మెరుగైన ఫలితాలు అందుకున్నాయని తెలిపాడు.

  • Loading...

More Telugu News