విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి సభకు హాజరవుతున్న పవన్ కల్యాణ్
- ఈ నెల 31న మధ్యాహ్నం 2 గంటలకు సభ
- ఈ అంశంపై తొలుత స్పందించింది పవన్ అన్న జనసేన
- ప్రజల భావోద్వేగాలను అమిత్ షాకు వివరించారని వ్యాఖ్య
విశాఖ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలని ఉక్కు పరిరక్షణ సమితి పోరాడుతోందని జనసేన తెలిపింది. ఈ అంశంపై తొలుత స్పందించి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది పవన్ కల్యాణే అని చెప్పింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందనే విషయాన్ని పవన్ తెలియజేశారని తెలిపింది. 34 మంది ప్రాణత్యాగాలతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటయిందనే విషయాన్ని అమిత్ షాకు చెప్పారని వెల్లడించింది.