Raghunandan Rao: కేసీఆర్ హుజూరాబాద్ కు రాకపోవడానికి కారణం ఇదే: రఘునందన్ రావు

This is the reason why KCR is not coming to Raghunandan Rao
  • అన్ని సర్వేలు ఈటలదే విజయం అని చెపుతున్నాయి
  • ఇంటెలిజెన్స్ కూడా టీఆర్ఎస్ ఓడిపోతుందని సమాచారం ఇచ్చింది
  • కేసీఆర్ నటనను ప్రజలు గమనిస్తున్నారు

ఏ సర్వే చూసినా హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ దే విజయమని చెపుతున్నాయని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. టీఆర్ఎస్ ఓడిపోబోతోందని ఇంటెలిజెన్స్ సమాచారం ఇచ్చిందని... అందుకే హుజూరాబాద్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ రావడం లేదని చెప్పారు. ఏప్రిల్ 27కి ముందు టీఆర్ఎస్ ప్లీనరీ పెట్టుకోవాలి కదా? ఇప్పుడెందుకు పెట్టుకున్నారని ప్రశ్నించారు.

తాము చాలా బిజీగా ఉన్నామనే విధంగా కేసీఆర్ నటిస్తున్నారని... కేసీఆర్ నటనను ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలు కేసీఆర్ కు షాకిస్తాయని... ఉపఎన్నిక తర్వాత ఆయన నేల మీదకు వస్తారని చెప్పారు. కరీంనగర్ జిల్లా అబాది జమ్మికుంటలో నిర్వహించిన యూత్ మీటింగ్ కు ఈటల, రఘునందన్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రఘునందన్ పైవ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News