Virat Kohli: కోహ్లీ, పంత్ చలవతో... టీమిండియా 151/7

Kohli and Pant handed India a respectable score
  • టీ20 వరల్డ్ కప్ లో సూపర్-12 పోరు
  • దుబాయ్ లో భారత్ వర్సెస్ పాకిస్థాన్
  • టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్
  • కోహ్లీ అర్ధసెంచరీ.. రాణించిన పంత్
పాకిస్థాన్ తో టీ20 వరల్డ్ కప్ సూపర్-12 మ్యాచ్ లో టీమిండియా బ్యాటింగ్ లైనప్ తడబాటుకు గురైంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 151 పరుగులు చేసింది. అది కూడా కెప్టెన్ విరాట్ కోహ్లీ (57), రిషబ్ పంత్ (39) రాణించడంతో ఆ మాత్రం స్కోరైనా వచ్చింది.

ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ ఆరంభంలోనే అవుట్ కాగా... పంత్ తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్ నిర్మించాడు. కానీ పాక్ బౌలర్లు కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ భారత్ పై ఒత్తిడి పెంచారు. ఆల్ రౌండర్ కోటాలో జట్టులో చోటు దక్కించుకున్న జడేజా 13 పరుగులు చేయగా, హార్దిక్ పాండ్య 11 పరుగులు చేసి అవుటయ్యాడు. పాక్ బౌలర్లలో షహీన్ అఫ్రిది 3, హసన్ అలీ 2, షాదాబ్ ఖాన్ 1, హరీస్ రవూఫ్ 1 వికెట్ తీశారు.
Virat Kohli
Pant
Team India
Pakistan
Super-12
T20 World Cup

More Telugu News