రేపు ఢిల్లీ వెళ్లనున్న 18 మందితో కూడిన టీడీపీ బృందం.. కోవింద్‌ను కలిసి రాష్ట్రపతి పాలనకు డిమాండ్
- కరోనా నేపథ్యంలో చంద్రబాబు సహా ఐదుగురికి మాత్రమే అపాయింట్‌మెంట్
- ప్రధాని, హోంమంత్రిని కూడా కలిసేందుకు ప్రయత్నం
- రెండు రోజులపాటు ఢిల్లీలోనే నేతలు
రేపు, ఎల్లుండి ఢిల్లీలోనే ఉండే ఈ నేతలు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాను కలిసి రాష్ట్ర పరిస్థితులపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా వారి అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం పెరిగిపోయిందని, డ్రగ్స్, గంజాయిసాగుకు ఏపీని కేంద్రంగా మార్చిందని టీడీపీ ఈ సందర్భంగా ఆరోపించింది. ప్రభుత్వంలోని కొందరు పెద్దలే వీటిని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించింది. రాష్ట్ర ప్రభుత్వం పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసిందని, శాంతిభద్రతలు పూర్తిగా లోపించాయని పేర్కొంది. కాబట్టి 356వ అధికరణ ప్రకారం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని రామ్‌నాథ్ కోవింద్‌ను టీడీపీ కోరనుంది.