గోవాపై మమత కన్ను.. 28 నుంచి రెండు రోజుల పర్యటన
- బీజేపీని, వారి విభజన రాజకీయాలను ఓడించండి
- గత పదేళ్లుగా గోవా ప్రజలు ఎన్నో బాధలు పడుతున్నారు
- బీజేపీని ఓడించేందుకు ప్రజలు, సంస్థలు ముందుకు రావాలి
మరోవైపు, గోవాపై కన్నేసిన టీఎంసీ పలువురు నేతలను తమ పార్టీలో చేర్చుకుంటోంది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి లుజినో ఫలైరో సహా పలువురు కాంగ్రెస్ నేతలు ఇప్పటికే టీఎంసీలో చేరారు. స్వతంత్ర ఎమ్మెల్యే ప్రసాద్ గోవాంకర్ కూడా టీఎంసీకి మద్దతు ప్రకటించారు. ఇంకోవైపు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా గోవాను చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి అధికారం కట్టబెడితే ప్రతి నెల 300 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తామని, స్థానికులకు 80 శాతం ఉద్యోగాలు అందేలా కృషి చేస్తామంటూ హామీల వర్షం కురిపించారు.