Surya: 'ఆకాశం నీ హద్దురా' కాంబినేషన్ రిపీట్ కానుందా?

Surya and Sudha Kongara combo
  • సుధా కొంగరతో సూర్య చర్చలు
  • గతంలో వచ్చిన 'ఆకాశమే నీ హద్దురా'
  • మరో ప్రాజెక్టుకు సన్నాహాలు
  • సూర్య విషయంలో రావలసిన స్పష్టత
తెలుగు .. తమిళ భాషల్లో సూర్యకి మంచి క్రేజ్ ఉంది. తమిళంలో ఎంతమాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు చేసే సూర్య, తమిళంతో పాటు తెలుగులోను ఒకేసారి తన సినిమాలను విడుదల చేస్తుంటాడు. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన తాజా చిత్రమైన 'జై భీమ్' సొంత బ్యానర్లో నిర్మితమైంది.

వచ్చే నెల 2వ తేదీ నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇంతకుముందు ఆయన చేసిన 'ఆకాశం నీ హద్దురా' సినిమా కూడా అమెజాన్ ప్రైమ్ ద్వారానే ప్రేక్షకులను పలకరించింది. ఆ సినిమాకి సుధా కొంగర దర్శకత్వం వహిస్తే,  జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చాడు. తమిళ .. తెలుగు భాషల్లో ఈ సినిమాకి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది.

మళ్లీ ఇప్పుడు అదే కాంబినేషన్ మధ్య చర్చలు జరుగుతున్నాయట. దర్శకురాలిగా సుధా కొంగర .. సంగీత దర్శకుడిగా జీవీ ప్రకాశ్ కుమార్ ఓకే. అయితే ఈ సినిమాలో సూర్య నటిస్తాడా? లేదంటే నిర్మాతగా మాత్రమే ఉంటాడా? అనే విషయంలో స్పష్టత రావలసి ఉంది. త్వరలోనే ఏ విషయమూ తెలిసే అవకాశం ఉంది.
Surya
Sudha Kongara
Prakash Kumar

More Telugu News