Ch Malla Reddy: రేవంత్ కు సబ్జెక్ట్ కూడా లేదు: మంత్రి మల్లారెడ్డి

 Revanth Reddy dont have knowledge says Malla Reddy
  • ఏం మాట్లాడతాడో రేవంత్ కే తెలియదు
  • దివాలా తీసిన పార్టీకి ఆయన అధ్యక్షుడు
  • హుజూరాబాద్ లో టీఆర్ఎస్ గెలుపు ఖాయం
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. ఏం మాట్లాడతాడో రేవంత్ కే తెయదని ఎద్దేవా చేశారు. ఆయనకు సబ్జెక్ట్ కూడా లేదని అన్నారు. ప్రజలను అయోమయానికి గురి చేస్తుంటాడని చెప్పారు.

అసలు రేవంత్ చెప్పే మాటలను ప్రజలు నమ్మరని అన్నారు. రేవంత్ కూడా ఒక లీడరేనా? అని ఎద్దేవా చేశారు. దివాలా తీసిన పార్టీకి రేవంత్ అధ్యక్షుడని వ్యంగ్యంగా అన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని జోస్యం చెప్పారు. బీజేపీ ఏం చేసిందని ఆ పార్టీ నేతలు ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణకు బీజేపీ ఎంపీలు కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని దుయ్యబట్టారు.
Ch Malla Reddy
Congress
Revanth Reddy
TRS

More Telugu News