Etela Rajender: అవును, రేవంత్ రెడ్డిని కలిశా.. ఇందులో తప్పేముంది?: ఈటల

Yes I met Revanth Reddy says Etela Rajender
  • రేవంత్ తో ఈటల రహస్యంగా భేటీ అయ్యారన్న కేటీఆర్
  • మంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు కలిశానన్న ఈటల
  • రాజీనామా చేసినప్పుడు చాలా మంది నేతలను కలిశానని వ్యాఖ్య
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో ఈటల రాజేందర్ భేటీ అయ్యారని... ఏడాదిన్నర తర్వాత ఆయన కాంగ్రెస్ లో చేరతారని మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ స్పందిస్తూ... 'అవును. నేను రేవంత్ రెడ్డిని కలిశా' అని స్పష్టం చేశారు. అయితే తాము కలిసింది ఇప్పుడు కాదని చెప్పారు.

తాను మంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు ప్రతిపక్షాలకు చెందిన పలువురు నేతలను కలిశానని... అందులో భాగంగానే అప్పట్లో రేవంత్ ను కలిశానని తెలిపారు. అయినా కాంగ్రెస్ నేత రేవంత్ ను తాను కలవడంలో తప్పేముందని కేటీఆర్ ని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అన్ని పార్టీల నేతలను కేసీఆర్ కలవలేదా? అని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఇతర నేతలను కలిస్తే తప్పేముందని అన్నారు.
Etela Rajender
BJP
Revanth Reddy
Congress
KTR
TRS

More Telugu News