genilia: సినిమా సీన్‌లో త‌న భార్య‌ను కొట్టినందుకు.. నిజ‌జీవితంలో స‌ర‌దాగా బాలీవుడ్ న‌టుడిని కొట్టిన జెనీలియా భ‌ర్త‌

genilia husband slaps bollywood hero
  • ఆయజ్ ఖాన్ తో క‌లిసి 'జానే తూ యే జానే నా'లో  న‌టించిన జెనీలియా
  • అందులో సన్నివేశపరంగా జెనీలియాను కొట్టిన ఆయ‌జ్
  • ఇప్పుడు ఆయ‌జ్ ను కొట్టిన జెనీలియా భ‌ర్త రితేశ్
బాలీవుడ్‌లో ఆయజ్ ఖాన్, జెనీలియా కలిసి నటించిన చిత్రం 'జానే తూ యే జానే నా' సినిమా అప్ప‌ట్లో మంచి హిట్ గా నిలిచింది. ఆ సినిమాలో జెనీలియా ప్రియుడి పాత్రలో ఆయజ్ ఖాన్ నటించాడు. ఓ సీన్‌లో భాగంగా జెనీలియాను ఆయజ్ ఖాన్‌ కొడతాడు.
           
తాజాగా, జెనీలియా భ‌ర్త‌, న‌టుడు రితేశ్ దేఖ్‌ముఖ్.. ఆజ‌య్ ఖాన్‌ను నిజ‌జీవితంలో స‌ర‌దాగా కొట్టాడు. 'జానే తూ యే జానే నా' సినిమాలో త‌న భార్య‌ను ఆయ‌జ్ ఖాన్ కొట్టినందుకే ప‌గ తీర్చుకున్నానంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్ చేశాడు. ఈ ద్వేషం ఎప్పటికీ ఆగదా? అంటూ ఆయజ్ ఖాన్ చుర‌కంటించాడు. ఈ వీడియో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోంది.
genilia
Bollywood

More Telugu News