Andhra Pradesh: దీక్ష అయిపోగానే చంద్రబాబు హైదరాబాద్ పారిపోతారు: వైసీపీ ఎంపీ బాలశౌరి

MP Balasouri Angry On Chandrababu
  • టీడీపీని రద్దు చేయాలని ఈసీకి ఫిర్యాదు చేస్తాం
  • అమిత్ షా కాన్వాయ్ పై దాడిని బీజేపీ ఇంకా మరువలేదు
  • అన్ని పార్టీల ముందు బాబును ఎండగడతాం
36 గంటల దీక్ష అయిపోగానే టీడీపీ అధినేత చంద్రబాబు.. హైదరాబాద్ పారిపోతారని వైసీపీ మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఎద్దేవా చేశారు. బాబు తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అరాచక రాజకీయాల్లో చంద్రబాబు, టీడీపీని మించినవారు లేరని విమర్శించారు.

 అమిత్ షా కాన్వాయ్ పై రాళ్ల దాడి చేయించిన ఘటనను బీజేపీ నేతలు ఇంకా మరచిపోలేదని అన్నారు. తెలుగుదేశం పార్టీని రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. పార్లమెంట్ లో టీడీపీ అరాచకాలపై మాట్లాడతామన్నారు. ఢిల్లీలోని అన్ని పార్టీలకు చంద్రబాబు వైఖరిని ఎండగడతామని ఆయన చెప్పారు.

గంజాయి, డ్రగ్స్ వ్యవహారంలో ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత పట్టాభి కామెంట్లు, ఆ తర్వాత ఆయనపై, టీడీపీ ఆఫీసులపై వైఎస్సార్ సీపీ కార్యకర్తల దాడుల నేపథ్యంలో చంద్రబాబు 36 గంటల దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలతో ఏపీలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కినట్టయింది.
Andhra Pradesh
Balasouri
YSRCP

More Telugu News