నయన్ జాతకంలో దోషం.. విఘ్నేశ్ కన్నా ముందు చెట్టుతో పెళ్లి?

Nayan To Marry Tree Before Vignesh
  • ఐశ్వర్యరాయ్ బాటలోనే నడుస్తున్న స్టార్ హీరోయిన్
  • పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్న నయన్ జంట
  • ప్రత్యేక హోమాలు, పూజలు చేస్తున్న వైనం
నయనతార, విఘ్నేశ్ జంట మరికొన్ని నెలల్లోనే పెళ్లితో ఒక్కటి కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వారిద్దరికీ ఎంగేజ్ మెంట్ జరిగింది. ఇటీవల వారు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు. నయన్ జాతకంలో ఓ దోషముందని పండితులు చెబుతుండడంతో.. వారు హోమాలు, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ క్రమంలో పెళ్లి విషయంలో నయన్.. ఐశ్వర్యరాయ్ బాటలోనే నడువనున్నట్టు తెలుస్తోంది.

దోషం కారణంగా విఘ్నేశ్ తో పెళ్లికి ముందు ఓ చెట్టును నయన్ పెళ్లి చేసుకోబోతున్నట్టు నయన్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఏడాది వీరిద్దరూ పెళ్లిపీటలు ఎక్కనున్నారు. పెళ్లి ముహూర్తాన్ని తిరుమలకు చెందిన పండితులు నిర్ణయించినట్టు సమాచారం. అతికొద్ది మంది సమక్షంలోనే పెళ్లి జరగనున్నట్టు చెబుతున్నారు. కాగా, ఇంతకుముందు ఐశ్వర్యరాయ్ కూడా దోషం కారణంగా అభిషేక్ బచ్చన్ ను పెళ్లాడేముందు చెట్టును పెళ్లి చేసుకున్నారు.
Go Back to Shorts
Nayanthara
Vignesh
Tollywood
Kollywood

More Telugu News