Pattabhi: పట్టాభిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు

TDP leader Pattabhi shifted to Rajahmundry Central Jail
  • ఏపీ సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యల కేసు
  • పట్టాభికి 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు
  • మచిలీపట్నం నుంచి రాజమండ్రికి పట్టాభి తరలింపు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఈ ఉదయం ఆయనను మచిలీపట్నం నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఉదయం ఆయనకు వైద్య పరీక్షలను నిర్వహించిన అనంతరం రాజమండ్రికి తీసుకెళ్లారు.

పట్టాభిని బుధవారం రాత్రి విజయవాడలోని ఆయన నివాసంలో అరెస్ట్ చేసి ఆ రాత్రి తోట్లవల్లూరు పీఎస్ లో ఉంచారు. నిన్న ఉదయం తోట్లవల్లూరు పీఎస్ నుంచి విజయవాడ మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. వాదనలు విన్న కోర్టు నవంబర్ 2వ తేదీ వరకు రిమాండ్ విధించింది.
Pattabhi
Telugudesam
Rajahmundray Central Jail
Jagan
YSRCP

More Telugu News