Ranganatha Raju: రాష్ట్రాభివృద్ధి ఆగిపోవాలని చంద్రబాబు కుట్ర చేస్తున్నారు: మంత్రి శ్రీరంగనాథ రాజు

Chandrababu is trying to stop AP development says Ranganatha Raju
  • చంద్రబాబు అండతోనే జగన్ పై పట్టాభి అనుచిత వ్యాఖ్యలు  
  • పట్టాభి గురించి చంద్రబాబు దీక్ష చేయడం సిగ్గుచేటు
  • చంద్రబాబు తీరు మార్చుకోవాలి
చంద్రబాబు అండతోనే పట్టాభి సీఎం జగన్ పై రాజ్యాంగ వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని మంత్రి శ్రీరంగనాథరాజు అన్నారు. సీఎం గురించి నీచంగా మాట్లాడిన పట్టాభి గురించి చంద్రబాబు దీక్ష చేయడం సిగ్గుచేటని చెప్పారు.

జగన్ తీసుకొచ్చిన పథకాలకు ప్రజలలో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే పట్టాభితో అనుచిత వ్యాఖ్యలు చేయించారని మండిపడ్డారు. పట్టాభి వ్యాఖ్యలు బాధాకరమని చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోవాలనేదే చంద్రబాబు కుట్ర అని అన్నారు. అవసరానికి పక్క పార్టీలను వాడుకుని వదిలేసే మనస్తత్వం చంద్రబాబుదని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు తీరు మార్చుకోవాలని అన్నారు.
Ranganatha Raju
Jagan
YSRCP
Chandrababu
Telugudesam
Pattabhi

More Telugu News