Shahrukh Khan: కుమారుడిని క‌లిసేందుకు జైలుకి వ‌చ్చిన షారుఖ్ ఖాన్.. వీడియో ఇదిగో

Actor Shah Rukh Khan reaches Mumbais Arthur Road Jail to meet son Aryan
  • డ్ర‌గ్స్ కేసులో అరెస్ట‌యిన ఆర్య‌న్ ఖాన్
  • ప్ర‌స్తుతం ముంబైలోని ఆర్థ‌ర్ రోడ్ జైలులో నిందితుడు
  • కుమారుడితో మాట్లాడిన షారుఖ్‌
డ్ర‌గ్స్ కేసులో బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు నిన్న‌ ముంబై స్పెషల్ కోర్టు బెయిల్ నిరాక‌రించిన విష‌యం తెలిసిందే. దీంతో ముంబైలోని ఆర్థర్ రోడ్ జైల్లోనే ఆర్య‌న్ ఉన్నాడు. త‌న కొడుకుకి బెయిల్ కోసం తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోన్న షారుఖ్ ఖాన్ ఈ రోజు జైలుకు వ‌చ్చాడు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఫొటోలు, వీడియోలు తీసేందుకు మీడియా ఎగ‌బ‌డింది. ఆర్య‌న్ ఖాన్‌తో మాట్లాడి అత‌డి యోగ‌క్షేమాల గురించి షారుఖ్ తెలుసుకుంటున్నాడు. ఆర్య‌న్ ఖాన్ అరెస్ట‌యిన నేప‌థ్యంలో ఇప్ప‌టికే షారుఖ్ ఖాన్ త‌న షూటింగుల‌న్నీ వాయిదా వేసుకున్నాడు.
Shahrukh Khan
Bollywood
drugs

More Telugu News