Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు నిరసన దీక్ష ప్రారంభం

Chandrababu protest against ycp workers attack started
  • టీడీపీ కార్యాలయాలపై దాడులకు నిరసనగా దీక్ష
  • రేపు రాత్రి 8 గంటలకు ముగియనున్న దీక్ష
  • పగిలిన అద్దాలు, ధ్వంసమైన సామగ్రి మధ్యలోనే కూర్చున్న చంద్రబాబు
ఏపీ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణుల దాడులను నిరసిస్తూ టీడీపీ అధినేత చేపట్టిన 36 గంటల నిరసన దీక్ష ప్రారంభమైంది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో దాడిలో పగిలిన అద్దాలు, ధ్వంసమైన సామగ్రి మధ్యలోనే చంద్రబాబు దీక్ష ప్రారంభించారు. సరిగ్గా 8 గంటలకు ప్రారంభమైన దీక్ష రేపు రాత్రి 8 గంటలకు ముగుస్తుంది. అధినేత దీక్ష నేపథ్యంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కార్యాలయానికి తరలివచ్చారు. తెలుగుదేశం పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతోపాటు వివిధ జిల్లాలకు చెందిన ముఖ్య నేతలు కూడా కార్యాలయానికి చేరుకున్నారు.
Chandrababu
Telugudesam
Protest

More Telugu News