Pattabhi: నా భర్తకు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత: పట్టాభి భార్య

If some thing happens to my husband govt has to be responsible says Pattabhi wife
  • పట్టాభిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • ఎఫ్ఐఆర్ కాపీని కూడా చూపించలేదన్న పట్టాభి భార్య
  • పోలీసులపై నాకు నమ్మకం లేదు
టీడీపీ నేత పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన ఇంటి తలుపులు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులు... ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆయనను విజయవాడలోని గవర్నర్ పేట పీఎస్ కు తరలిస్తున్నట్టు భావిస్తున్నారు. మరోవైపు పోలీసులు వ్యవహరించిన తీరుపై పట్టాభి భార్య మండిపడ్డారు. కనీసం ఎఫ్ఐఆర్ కాపీ కూడా చూపించలేదని అన్నారు. పోలీసులపై తనకు నమ్మకం లేదని చెప్పారు.

పటమట పీఎస్ లో కేసు నమోదయిందని పోలీసులు చెప్పారని ఆమె తెలిపారు. పోలీసులు వచ్చినప్పుడు ఇంట్లో తాను, తన భర్త మాత్రమే ఉన్నామని చెప్పారు. తన భర్తకు ఏం జరిగినా పోలీసులే బాధ్యత వహించాలని అన్నారు. తలుపులు బద్దలుకొట్టి ఇంట్లోకి రావాల్సిన అవసరం ఏముందని మండిపడ్డారు.
Pattabhi
Wife
Arrest
Telugudesam
Police

More Telugu News