డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం మోపండి.. ఎంతటివారైనా ఉపేక్షించొద్దు: కేసీఆర్
- పరిస్థితి తీవ్రతరం కాకముందే గట్టి చర్యలు తీసుకోవాలి
- డగ్స్ తీసుకోవడం వల్ల మానసిక స్థితి దెబ్బతింటుంది
- విద్యాసంస్థల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయండి
డ్రగ్స్ వినియోగం వల్ల మానసిక స్థితి దెబ్బతింటుందని... ఆత్మహత్యలకు కూడా పాల్పడే అవకాశం ఉందని అన్నారు. డ్రగ్స్, గంజాయి వినియోగించే వారు ఎంతటివారైనా ఉపేక్షించొద్దని చెప్పారు. వీటిని నియంత్రించేందుకు డీజీ స్థాయి అధికారిని ప్రత్యేకంగా నియమించాలని తెలిపారు. ఇంటెలిజెన్స్ శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని చెప్పారు. విద్యాసంస్థల వద్ద ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయాలని అన్నారు.