Virat Raju: హరనాథ్ మనవడు హీరోగా షూటింగ్ ప్రారంభం!

Virat Raju new movie started
  • అలనాటి అందాల నటుడు హరనాథ్
  • ఇంతకాలానికి ఆ ఫ్యామిలీ నుంచి మరో హీరో
  • ఈ రోజునే మొదలైన షూటింగు
  • సినిమా పేరు 'సీతామనోహర శ్రీరాఘవ'  
తెలుగు తెరపై శోభన్ బాబు కంటే ముందుగా అందాల హీరో అనిపించుకున్నది హరనాథ్. రొమాంటిక్ హీరోగా అప్పట్లో ఆయనకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పటికీ ఆయనను అభిమానించేవారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి ఆయన ఫ్యామిలీ నుంచి ఇంతకాలానికి ఒక హీరో వస్తున్నాడు .. అతని పేరే 'విరాట్ రాజు'.

హరనాథ్ కి వెంకట సుబ్బరాజు అనే సోదరుడు ఉన్నారు. ఆయన మనవడు .. అంటే హరనాథ్ మనవడే ఈ విరాట్ రాజు. ఆయన హీరోగా ఎంట్రీ ఇస్తున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. ఆయన మొదటి సినిమా 'సీతామనోహర శ్రీరాఘవ' ఈ రోజునే పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ సినిమాకి దుర్గా శ్రీవాత్సవ దర్శకత్వం వహిస్తున్నాడు.   

అనిల్ రావిపూడి క్లాప్ తో .. ఎ.ఎమ్. రత్నం కెమెరా స్విచ్చాన్ చేయడంతో ఈ సినిమా షూటింగు లాంఛనంగా మొదలైంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టనున్నారు. వందన మూవీస్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాలో, రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.
Virat Raju
Sri Vastava
Haranath

More Telugu News