Nara Lokesh: ఎన్నాళ్లిలా ఇంట్లో దాక్కుని నీ కుక్కలతో దాడులు చేయిస్తావు... నువ్వే రా తేల్చుకుందాం!: నారా లోకేశ్ ఫైర్

Nara Lokesh fires on CM Jagan on latest attacks on TDP
  • రాష్ట్రంలో టీడీపీ నేతల ఇళ్లపై దాడులు
  • మంగళగిరిలో పార్టీ ప్రధాన కార్యాలయం ధ్వంసం
  • మండిపడిన లోకేశ్
  • "కోడికత్తిగా" అంటూ తీవ్ర వ్యాఖ్యలు
రాష్ట్రంలో టీడీపీ నేతల నివాసాలపై దాడులు, మంగళగిరిలో పార్టీ ప్రధాన కార్యాలయం ధ్వంసం ఘటనలపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో స్పందించారు. ఎన్నాళ్లు ఇలా ఇంట్లో దాక్కుని నీ కుక్కలతో దాడి చేయిస్తావు... నువ్వే రా తేల్చుకుందాం! అంటూ సవాల్ విసిరారు.

"ఇప్పటివరకు ముఖ్యమంత్రి అని గౌరవించేవాడ్ని. నీ వికృత, క్రూర బుద్ధి చూశాక సైకో, శాడిస్ట్, డ్రగ్గిస్ట్ జగన్ అని అంటున్నాను. నువ్వూ, నీ బినామీలు డ్రగ్స్ దందా చేస్తారు... ఆ విషయాలపై నిలదీసే టీడీపీ నేతలపై దాడులకు పాల్పడతావా?" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

"నీ కార్యాలయాల విధ్వంసం మాకు నిమిషం పని. మా కార్యకర్తలు నీ ఫ్యాన్ రెక్కలు మడిచి, విరిచి నీ పెయిడ్ ఆర్టిస్టులను రాష్ట్రం దాటేంత వరకు తరిమికొడతారు" అంటూ హెచ్చరించారు.

"ఆనవాయితీలన్నింటిని తుంగలో తొక్కి, ప్రజాస్వామ్యానికి పాతరేసి, నీ సమాధికి నువ్వే గొయ్యి తవ్వుకుంటున్నావు కోడికత్తిగా!" అంటూ ఘాటైన పదజాలం ఉపయోగించారు.

"తెలుగుదేశం సహనం చేతకానితనం అనుకుంటున్నావా? నీ పతనానికి ఒక్కో ఇటుకా నువ్వే పేర్చుకుంటున్నావు. పరిపాలించమని ప్రజలు అధికారం అందిస్తే పోలీసుల అండతో మాఫియా సామ్రాజ్యం నడుపుతావా? టీడీపీ కేంద్ర కార్యాలయంపై గూండా మూకలతో దాడులకు తెగబడతావా?" అంటూ లోకేశ్ మండిపడ్డారు.

"నిన్ను ఉరికించి కొట్టడానికి టీడీపీ అధికారంలోకి రావాల్సిన పనిలేదు. నీ అరాచకాలపై ఆగ్రహంతో ఉన్న క్యాడర్ కు మా లీడర్ ఒక్క కనుసైగ చేస్తే చాలు" అంటూ స్పష్టం చేశారు.
Nara Lokesh
Attacks
CM Jagan
TDP
YSRCP

More Telugu News